




Best Web Hosting Provider In India 2024

Parenting tips: పేరెంట్స్ చేేసే ఈ 5 తప్పులు పిల్లల్లో వారిపై ద్వేషాన్ని పెంచుతాయి
Parenting tips: చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు పిల్లల దృష్టిలో వారిని శత్రువులుగా మారిపోతారు. ముఖ్యంగా పిల్లల వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రులు వారి ముందు కొన్ని పనులు, అలవాట్లు వదిలేయాలి.
పిల్లలను సరిగ్గా పెంచడం చాలా సవాలుతో కూడుకున్న పని. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు తల్లిదండ్రులు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పులు వారి పిల్లలపై నెగిటివ్ ఫీలింగ్ ను పెంచుతాయి. పిల్లల వయసు పెరిగే కొద్దీ వారి ఆలోచనల్లో, ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. వారి వయసుకు తగ్గట్టు తల్లిదండ్రులు ప్రవర్తించాలి. తల్లిదండ్రులు చేసే పనులు కొన్ని పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపించి వారిలో శత్రుత్వం పెరిగేలా చేస్తాయి. చాలాసార్లు తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు వారిలో ద్వేషాన్ని పెంచేస్తాయి.

పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడం
వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అనేక మార్పులు వస్తుంటాయి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పిల్లవాడు కొత్తగా ఫీలవుతాడు. ప్రేమ, ఆకర్షణ, మమకారం, అసూయ, ఎవరిపైనైనా దూకుడుగా మాట్లాడడం వంటి అనేక భావోద్వేగాలు ఈ వయసులో పిల్లల్లో కనిపిస్తాయి. కానీ తల్లిదండ్రులు పిల్లల భావాలను విస్మరించి, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని ఫీలవ్వడం మొదలవుతారు.
అతిగా అడ్డుకోవడం
తల్లిదండ్రులుగా పిల్లలను క్రమశిక్షణలో పెంచడం చాలా ముఖ్యం. కానీ పెరుగుతున్న పిల్లలను అతిగా అడ్డుకోవడం సరికాదని కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల వయసు పెరుగుతున్నప్పుడు వారి నిర్ణయాల్లో అతిగా జోక్యం చేసుకోకూడదు. ఎక్కడికి వెళ్తున్నావ్, ఏం చేస్తున్నావ్, ఏం తింటున్నావ్… ఇలా ప్రతిసారీ ప్రశ్నించకూడదు. ఇలాంటి ప్రశ్నలు కొంత కాలం తర్వాత పిల్లలను చికాకు పెట్టడం ప్రారంభిస్తాయి. మీపై కూడా వారు చికాకు పడడం మొదలవుతుంది.
వారిపై మీ ఇష్టాలు రుద్దకండి
తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. ఇది పూర్తిగా సాధారణం. కానీ మీరు మీ కలలు, మీ కోరికలు, మీ ఇష్టాయిష్టాలను పిల్లలపై రుద్దడం ప్రారంభించినప్పుడు పిల్లవాడు చాలా ఇబ్బందికరంగా ఫీలవుతాడు. పిల్లవాడు ఎదగడం ప్రారంభించినప్పుడు, అతను తన స్వంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాడు. తన ఇష్టాయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఈ సమయంలో, తల్లిదండ్రులు అతని ఆలోచనలను, ఇష్టాయిష్టాలను విస్మరిస్తారు. తమకు నచ్చినవారిపై పిల్లలపై రుద్దడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు పిల్లల్లో మీపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి.
పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు కూడా వారి ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. పిల్లవాడు ఎదుగుతున్నాడనే విషయం గుర్తించి… వారికి కావాల్సిన ఆత్మగౌరవం అందించాలి. అటువంటి పరిస్థితిలో, పిల్లల గురించి ఎవరి ముందు చెడుగా మాట్లాడటం, పిల్లవాడిపై అరవడం, అతనికి గౌరవం ఇవ్వకపోవడం వంటివి చేయకూడదు. ఇలాంటి మీ ప్రవర్తన మీ పిల్లల్లో మిమ్మల్ని విలన్ గా మార్చేస్తుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం మానేయవచ్చు.
తల్లిదండ్రులుగా, బిడ్డకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోవడం మీ కర్తవ్యం. అలాగని మీ పిల్లలకు నచ్చే ఏ పనిని చేయకుండా అడ్డుకోకూడదు. పిల్లల అభిప్రాయం కూడా తీసుకోవాలి. మీ నిర్ణయాన్ని మీ పిల్లలపై రుద్దడం ద్వారా మీపై వారు ద్వేషాన్ని పెంచుకుంటారు. సరైన నిర్ణయాలు తీసుకునేలా పిల్లలను ప్రేరేపించడం మీ కర్తవ్యం. అతనితో కూర్చొని మాట్లాడి, వివరించి, ఆయన సమ్మతితో నిర్ణయం తీసుకోండి. ఇది పిల్లవాడిని మంచి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా చేస్తుంది. అదే సమయంలో మీ పట్ల అతని గౌరవాన్ని మరింత పెంచుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్