OTT Malayalam: 7 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 9 ఐఎండీబీ రేటింగ్!

Best Web Hosting Provider In India 2024

OTT Malayalam: 7 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 9 ఐఎండీబీ రేటింగ్!

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2025 09:33 AM IST

Trisha Tovino Thomas Identity OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ తెలుగుతో సహా 4 భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. త్రిష, టొవినో థామస్ నటించిన ఐడెంటిటీకి ఐఎండీబీ నుంచి 9 రేటింగ్ ఉంది. థియేటర్లలో తెలుగులో విడుదలైన 7 రోజుల్లోనే ఐడెంటిటీ ఓటీటీ రిలీజ్ అయింది.

7 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 9 ఐఎండీబీ రేటింగ్!
7 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 9 ఐఎండీబీ రేటింగ్!

Trisha Tovino Thomas Identity OTT Release Today: ఓటీటీ మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్న టాక్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంటాయి. అలా 2025 సంవత్సరంలో మలయాళం నుంచి థియేటర్లలో రిలీజ్ అయిన తొలి సినిమా ఐడెంటిటీ.

yearly horoscope entry point

త్రిష-టొవినో థామస్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ తమిళం, మలయాళ మూవీస్‌తో బిజీగా ఉంటోంది. మాలీవుడ్‌లో డిఫరెంట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు టొవినో థామస్. ఇలాంటి త్రిష, టొవినో థామస్, హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమానే ఐడెంటిటీ.

హిట్ టాక్ కానీ, బాక్సాఫీస్ ఫెయిల్యూర్

క్రైమ్ అండ్ యాక్షన్, మర్డర్ మిస్టరీ జోనర్‌లో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న మలయాళంలో విడుదలైన సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కానీ, బాక్సాఫీస్ పరంగా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఇక జనవరి 24న తెలుగులో థియేటర్లలో ఐడెంటిటీ సినిమాను విడుదల చేశారు. ఇక్కడ సినిమాకు సానుకూల స్పందన లభించింది.

ఐడెంటిటీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్

అయితే, రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అయితే, ఆరు కోట్లు అదనంగా వచ్చినప్పటికీ సినిమా అంచనాల దృష్ట్యా నిరాశపరిచినట్లు అయింది. కానీ, ఐడెంటిటీ సినిమాకు ప్రశంసలు బాగానే వచ్చాయి. దాంతో ఐఎమ్‌డీబీ నుంచి 9 రేటింగ్ సాధించుకుని సత్తా చాటింది ఐడెంటిటీ మూవీ.

ఐడెంటిటీ ఓటీటీ స్ట్రీమింగ్

ఇక తాజాగా ఐడెంటిటీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టీ (జనవరి 31) నుంచి జీ5 ఓటీటీలో ఐడెంటిటీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఐడెంటిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం మలయాళ సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే.

ఐడెంటిటీ స్టోరీ

అందుకే మలయాళ వెర్షన్ రీత్యా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చిన ఐడెంటిటీ తెలుగు థియేట్రికల్ రిలీజ్‌ను బట్టి చూస్తే వారంరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. కాగా, ఐడెంటిటీ సినిమా పోలీస్ ఆఫీసర్ (వినయ్ రాయ్), జర్నలిస్ట్ (త్రిష), స్కెచ్ ఆర్టిస్ట్ (టొవినో థామస్) చుట్టూ తిరుగుతుంది. వరుస మర్డర్స్ చేస్తున్న ఓ కిల్లర్‌ను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్, జర్నలిస్ట్ ప్రయత్నాలు చేస్తుంటారు.

ఐడెంటిటీలోని ట్విస్టులు

ఈ క్రమంలో వైరికి హెల్ప్ చేయడానిరికి స్కెచ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇస్తాడు. అయితే, జర్నలిస్ట్ మానసిక సమస్యలతో బాధపడుతుంటుంది. కేసు ముందుగు సాగుతున్న కొద్దీ ముగ్గురు ఒకరిపై మరొకరికి అనుమానం వస్తుంటుంది. అలా, చివరి వరకు ఎవరు కిల్లర్, ఎవరు ఏం చేశారు అనే థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేసేలా ఐడెంటిటీ ఉంటుందని పలు రివ్యూల్లో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024