




Best Web Hosting Provider In India 2024

OTT Romantic Comedy Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్
OTT Romantic Comedy Web Series: ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మలయాళం వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తో తెలుగు సహా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.
OTT Romantic Comedy Web Series: రొమాంటిక్ కామెడీ జానర్లో మరో మలయాళం వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సిరీస్ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ శుక్రవారం (జనవరి 31) ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ పేరుతో మలయాళం వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి వస్తోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించకపోయినా.. త్వరలోనే అంటూ ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 31) ట్వీట్ చేసింది. చాలా రోజుల కిందటే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్.. మొత్తానికి ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“సమ్‌థింగ్ స్పెషల్ నిర్మిస్తున్నాం. లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ పోస్టర్లో వెబ్ సిరీస్ లోని లీడ్ క్యారెక్టర్లను చూడొచ్చు.
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ స్టోరీ ఇదీ
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ లో నీరజ్ మాధవ్, గౌరి కిషన్, అజు వర్గీస్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఇందులోని లీడ్ రోల్ ఓ ఇంటిని నిర్మించుకోవాలని పడే తాపత్రయం చుట్టూ తిరుగుతుంది. విష్ణు జి రాఘవ్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.
గతంలో వాశి అనే మూవీ ద్వారా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. గతంలో హాట్‌స్టార్ తో కేరళ క్రైమ్ ఫైల్స్, పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించిన అజూ వర్గీస్.. ఇప్పుడీ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
సంబంధిత కథనం