చోలీ కే పీఛే క్యాహై పాటకు పెళ్లి కొడుకు స్టెప్పులు.. వివాహం రద్దు చేసిన పెళ్లి కూతురు తండ్రి!

Best Web Hosting Provider In India 2024


చోలీ కే పీఛే క్యాహై పాటకు పెళ్లి కొడుకు స్టెప్పులు.. వివాహం రద్దు చేసిన పెళ్లి కూతురు తండ్రి!

Anand Sai HT Telugu
Feb 02, 2025 09:49 PM IST

Groom Dance Wedding Cancel : చోలీ కే పీఛే క్యాహై అనే పాటకు పెళ్లి కొడుకు డ్యాన్స్ చేశాడు. దీంతో పెళ్లి కూతురు తండ్రికి చిరాకెత్తుకొచ్చి.. వివాహం రద్దు చేశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా పెళ్లి అనగా ఆటాపాటా ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు మాత్రం అస్సలు ఊరుకోరు. పెళ్లి కొడుకు వచ్చి డ్యాన్స్ చేసేదాగా వెంటపడుతారు. కానీ ఓ పెళ్లిలో మాత్రం పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం వివాహం రద్దుకు కారణమైంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

yearly horoscope entry point

వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌పై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మాధురీ దీక్షిత్ హిట్ పాటకు పెళ్లి కొడుకు అనుచితంగా డ్యాన్స్ చేశాడని పెళ్లిని రద్దు చేసినట్టుగా అందులో ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దిల్లీలో ఇటీవల ఓ పెళ్లి జరుగుతోంది. అయితే వేదిక వద్దకు ఊరేగింపుగా వస్తున్నాడు వరుడు. ఆ సమయంలో స్నేహితులు డ్యాన్స్ చేద్దామని అతడిని పిలిచారు. ఈ సమయంలో చోలీ కే పీఛే క్యాహై అనే పాటకు డ్యాన్స్ చేయడం మెుదలుపెట్టారు. వేదిక వద్దకు వచ్చిన తర్వాత తమతో కలిసి డ్యాన్స్ చేయమని యువకుడి స్నేహితులు కోరారు. ఖల్ నాయక్‌లోని చోలీ కే పీఛే పాట ఎంత ఫేమస్ అని అందరికీ తెలిసిందే. పాటను ప్లే చేయడంతో పెళ్లి కొడుకు కూడా స్టెప్పులు వేశాడు.

అయితే ఈ స్టెప్పులు వధువు తండ్రికి నచ్చలేదు. అనుచితంగా ఉందంటూ వెంటనే వేడుకను నిలిపివేసి పెళ్లిని రద్దు చేశారు. వరుడి చర్యలతో తమ కుటుంబ విలువలు దెబ్బతిన్నాయని పెళ్లి కుమార్తె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వధువు కూడా ఈ ఘటనతో ఏడ్చింది.

వధువు తండ్రి దగ్గరకు వచ్చిన వరుడు అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదంతా సరదాగానే అని వెల్లడించాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న వధువు తండ్రి.. వరుడు చెప్పే మాటలు అస్సలు వినిపించుకోలేదు. పెళ్లి కొడుకు వివరణ పట్టించుకోకుండా పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లిని రద్దు చేసుకున్న తర్వాత కూడా తన కోపాన్ని అలానే కొనసాగించాడు ఆ తండ్రి.

మరోవైపు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించిన వార్త వెంటనే వైరల్‌గా మారింది. వధువు తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడని, లేదంటే రోజూ అల్లుడు డ్యాన్స్ చూడక తప్పదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నేను కూడా నా పెళ్లిలో డాన్స్ చేస్తాను.. అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

అరేంజ్డ్ మ్యారేజ్‌లు సర్ ప్రైజ్ ఎగ్జామ్స్ లాంటివి.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు.. ఎలిమినేషన్ రౌండ్ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link