



Best Web Hosting Provider In India 2024

Kedar Selagamshetty: అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ నిర్మాత కన్నుమూత.. గం గం గణేశా మూవీతో పాపులర్
Kedar Selagamshetty: అల్లు అర్జున్ సన్నిహితుడు, టాలీవుడ్ ప్రొడ్యూసర్ అకాల మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది. దుబాయ్ లో మంగళవారం (ఫిబ్రవరి 25) జరిగిన ఈ ఘటనపై ఇండస్ట్రీ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి.
Kedar Selagamshetty: టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగమ్‌శెట్టి కన్నుమూశాడు. గతేడాది ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా మూవీతో అతడు పాపులర్ అయ్యాడు. అతడు టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సన్నిహితుడు. కేదార్ మంగళవారం (ఫిబ్రవరి 25) దుబాయ్ లో తుదిశ్వాస విడిచాడు.
కేదార్ సెలగమ్‌శెట్టి కన్నుమూత
నిర్మాత కేదార్ సెలగమ్‌శెట్టి కన్నుమూయడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని మరణానికి కారణమేంటో తెలియలేదు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థలాంటి హీరోలకు సన్నిహితుడు కావడంతోపాటు గతేడాది గం గం గణేశా మూవీ ద్వారా కూడా పాపులర్ అయ్యాడు.
హైదరాబాద్ లోని జూబ్లీ 800 పబ్ కు ఓనర్ కూడా. అల్లు అర్జున్ తో కలిసి అతడు ఈ బిజినెస్ లోకి దిగినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో ఈ పబ్ ఉంది. అంతేకాదు గతంలో విజయ్ దేవరకొండ, సుకుమార్ లతో కేదార్ ఓ సినిమా కూడా అనౌన్స్ చేశాడు. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు. కొన్నాళ్లుగా కేదార్ దుబాయ్ లోనే ఉంటున్నాడు. అతనికి ఓ కూతురు కూడా ఉంది.
గం గం గణేశా మూవీ గురించి..
కేదార్ సెలగమ్‌శెట్టి గతేడాది ఆనంద్ దేవరకొండతో కలిసి గం గం గణేశా అనే మూవీ తీశాడు. గతేడాది మే 31న థియేటర్లలో రిలీజైంది. గం గం గణేశా మూవీలో ఆనంద్ దేవరకొండకు జోడీగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. జబర్ధస్థ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెలకిషోర్, రాజ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాతో ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రైమ్ కామెడీ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గణేష్‌గా ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్‌తో పాటు కథలోని కామెడీ, ట్విస్ట్‌లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చాయి.
సంబంధిత కథనం