



Best Web Hosting Provider In India 2024
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్.. త్వరలో అప్లికేషన్ ముగుస్తుంది
ఇండియన్ ఆర్మీ 12వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన యువత కోసం 90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో ముగియనుంది.
దేశానికి సేవ చేయాలని కలలు కనేవారికి శుభవార్త. ఇండియన్ ఆర్మీ 2025 రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద 90 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. జేఈఈ (మెయిన్) 2025కు హాజరైన యువ అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకం.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 13 మే 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 12 జూన్ 2025 మధ్యాహ్నం 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in అధికారిక వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలి. వయోపరిమితి విషయానికొస్తే అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే పుట్టిన తేదీ 2 జనవరి 2006-1 జనవరి 2009 మధ్య ఉండాలి.
దరఖాస్తుదారులు ఏ యూపీఎస్సీ పరీక్ష నుండి డిబార్ చేసి ఉండకూడదు. అరెస్టు అయి ఉండకూడదు, క్రిమినల్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారించబడొద్దు. లేదా ఏదైనా పెండింగ్ కోర్టు కేసులో విచారణకు హాజరు కాకూడదు. సీనియర్ సెకండరీలో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) చదివి జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 90 సీట్లు భర్తీ చేస్తారు.
joinindianarmy.nic.in వెళ్లి, హోమ్ పేజీలో ఆఫీసర్స్ ఎంట్రీ అప్లై/లాగిన్‌తో లింక్‌పై క్లిక్ చేసి, మీ ప్రాథమిక సమాచారం ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫారం నింపడం, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఫారాన్ని సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దేశానికి సేవ చేయాలనే తపన ఉంటే, టెక్నికల్ రంగంలో మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకుంటే.. ఇండియన్ ఆర్మీకి చెందిన ఈ రిక్రూట్మెంట్ మీకు గొప్ప అవకాశం. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి.
Best Web Hosting Provider In India 2024
Source link