Youth Cheated Producer : ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాత చుట్టూ ప్రదక్షిణాలు, అవకాశం చిక్కగానే బంగారంతో జంప్

Best Web Hosting Provider In India 2024

Youth Cheated Producer : ” సినిమాలో ఒక్క ఛాన్స్ ” అంటూ వచ్చిన యువకుడు ఓ నిర్మాత(Producer)కు టోకరా వేసి బంగారు ఆభరణాలు(Gold Ornaments), నగదుతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……శ్రీ కృష్ణానగర్ లో నివాసం ఉంటున్న టంగుటూరి ఎల్లులు బాబు భావేశ్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ నడిపిస్తున్నాడు. గత ఏడాది హీరో సాయికుమార్ ప్రధాన పాత్రధారిగా ” నాతో నేను ” అనే చిత్రానికి ఈయన నిర్మాతగా ఉన్నారు. ఇటీవలే ఆయన తీయబోయే కొత్త సినిమా నటీనటుల(Cine Actors) కోసం నిర్మాత బాబు ప్రకటనలు ఇచ్చారు. కాగా శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవలే బాబు వద్దకు వచ్చి…. సినిమాలో నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరాడు. రెండు మూడు సార్లు ఆఫీస్ కు రావడంతో త్వరలోనే ఆడిషన్లు పెట్టిస్తానని నిర్మాత బాబు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈనెల 1న ఆడిషన్లు కోసం రావాలని శ్రీకాంత్ ను కోరడంతో ……ఆఫీస్ కు చేరుకున్న శ్రీకాంత్ దాదాపు రెండు గంటల పాటు తన నటనా ప్రతిభను నిర్మాతకు చూపించాడు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మంచి నటుడిగా ఎదుగుతానంటూ నిర్మాతను మాటల్లో పెట్టాడు.

మద్యం తాగించి బంగారం చోరీ

మధ్యాహ్నం కావడంతో పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి భోజనం తీసుకురావాలని బాబు సూచించాడు. దాంతో బయటకు వెళ్లిన శ్రీకాంత్ భోజనంతో పాటు మద్యాన్ని (Liquor)కూడా తెచ్చాడు. అభిమానంతో మద్యం తీసుకువచ్చానంటూ మాయ మాటలు చెప్పి…..బాబుతో శ్రీకాంత్ విపరీతంగా మద్యం తాగించాడు. దీంతో నిర్మాత బాబు నిద్రలోకి జారాడు. దాంతో ఆయన మెడలో ఉన్న చైన్లు(Gold Chain), రింగ్ లు, బ్రాస్లెట్ లు మొత్తం 13 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. వీటితో పాటు బ్యాగ్ లో ఉన్న రూ.50 వేల నగదు కూడా చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు రాత్రి నిద్ర లేచి చూసుకోగా…..తమ ఒంటి మిద బంగారం, బ్యాగ్ లో నగదు మిస్ అయినట్టు గుర్తించాడు నిర్మాత(Producer) బాబు. జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తన కుమారుడు ప్రవీణ్ కు చెప్పి……జూబ్లీహిల్స్ (Jubilee Hills)పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 380 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సీసీ కెమెరాల(CC Cameras) ద్వారా నిందితుడు శ్రీకాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తక్కువ ధరకే ప్లాట్లు అంటూ రూ 12.35 కోట్లు మోసం

నకిలీ పాత్రలతో మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలకే ప్లాట్లు ఇస్తానంటూ నమ్మించి కోట్లాది రూపాయలు వసూల్ చేసి మోసాలకు పాల్పడిన కిలాడి జంటను హైదరాబాద్(Hyderabad) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ శ్వేత కథనం ప్రకారం…… వీబీజే క్యాప్స్టన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నడుపుతున్న కందుల వెంకట ప్రసాద్ గుప్త, ఆయన భార్య కందుల అనురాధ గుప్త కలిసి కాప్రా పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో వెల్ఫేర్ సొసైటీలో తమ ప్లాట్లు(plots) ఉన్నాయని, వాటిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి, నకిలీ అగ్రిమెంట్లు(Fake Agreements), నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి పలువురు నుంచి మొత్తం రూ 12.35 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCrime TelanganaHyderabadTrending TelanganaTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024