Germany Jobs: స్కిల్ బి ద్వారా ఏపీ నర్సింగ్ స్టూడెంట్స్ కు జర్మన్ భాషలో శిక్షణ, ఏటా జర్మనీలో వెయ్యి ఉద్యోగాలు…

Best Web Hosting Provider In India 2024

Germany Jobs: స్కిల్ బి ద్వారా ఏపీ నర్సింగ్ స్టూడెంట్స్ కు జర్మన్ భాషలో శిక్షణ, ఏటా జర్మనీలో వెయ్యి ఉద్యోగాలు…

Sarath Chandra.B HT Telugu Feb 27, 2025 12:38 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Feb 27, 2025 12:38 PM IST

Germany Jobs: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం విద్యనభ్యసించే విద్యార్థినులకు జర్మనీ, ఐరోపాదేశాల్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది.

జర్మన్ భాషలో శిక్షణ కోసం స్కిల్‌ బితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
జర్మన్ భాషలో శిక్షణ కోసం స్కిల్‌ బితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Germany Jobs: జర్మన్‌ భాషలో ఏపీ నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో స్కిల్‌ బితో ఎంఓయుపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… జర్మనీలో వృద్ధుల సంరక్షణ, హాస్పటల్స్ లో 3లక్షలమంది నర్సింగ్ అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు.

యూరప్ లో ముఖ్యంగా జర్మనీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను రాష్ట్రంలో నర్సింగ్ విద్యనభ్యసించిన విద్యార్థినులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఈ శిక్షణ వల్ల ప్రతిఏటా వెయ్యిమంది నర్సింగ్ విద్యార్థినులకు జర్మనీలో అత్యుత్తమ ప్యాకేజితో ఉద్యోగాలు లభిస్తాయని నారా లోకేష్‌ చెప్పారు. స్కిల్ బి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ వింజమూరి రవిచంద్రగౌతమ్, సిఇఓ ఉజ్వల్ చౌహన్ మాట్లాడుతూ… తమ సంస్థ ఆధ్వర్యాన ఇప్పటివరకు 10వేలమందికిపైగా విదేశాల్లో ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.

స్కిల్ బి అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ రిక్రూట్‌మెంట్ స్టార్టప్‌లలో ఒకటిగా ఉందని తెలిపారు. జర్మనీ, పోలాండ్, హంగేరీ, లిథువేనియా, లాట్వియా, ఇతర తూర్పు ఐరోపా దేశాలకు తమ సంస్థ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేస్తున్నామని అన్నారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎఎన్ఎం స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేషన్ పొందిన నర్సులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి, ప్లేస్ మెంట్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. స్కిల్‌బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎపిఎస్ఎస్డిసిలు భాషా నైపుణ్య కొరతను పరిష్కరించి, ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్య రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, విశాఖపట్నంలోని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు, ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లోని 4వేలమందికి పైగా నర్సింగ్ విద్యార్థులకు స్కిల్ బి ద్వారా జర్మన్ భాషలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎపి స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ఎపిఎస్ఎస్డిసి సిఇఓ గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మనోహర్, మెడిక్రూటర్ ఎండి రోనాల్డ్ రెస్కే పాల్గొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Nara LokeshAndhra Pradesh NewsCoastal Andhra PradeshGovernment Of Andhra PradeshVijayawadaVijayawada Floods
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024