




Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కూతురితో శివ నారాయణ వీడియో కాల్- శౌర్యకు అక్కలా కాంచన- 10 లక్షలు మోసపోయిన కాశీ
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 28 ఎపిసోడ్లో దశరథ్ను పక్కకు పిలిచి కూతురు గురించి అడుగుతాడు శివ నారాయణ. దాంతో మొబైల్ తీసుకొచ్చి వీడియో కాల్ చేస్తాడు దశరథ్. అందులో కాంచనను చూస్తాడు శివ నారాయణ. కాశీ రూ. పది లక్షలు మోసం పోయినట్లు స్వప్నకు తెలుస్తుంది. అది తల్లి కావేరికి చెబుతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తనను వెళ్లనివ్వకుండా ఆపింది మీరే కదా అని పారిజాతంను ఇరికిస్తుంది దీప. దాంతో అయితే సారీ చెప్పాల్సిందే అని శివ నారాయణ అంటాడు. సారీ చెప్పేవరకు వదిలేలా లేడు అని జ్యో, సారీ చెప్పాల్సిందే అని కార్తీక్ అనుకుంటారు. నా కూతురుని దారిలో పెట్టలాంటే వీళ్లే కరెక్ట్ అని దశరథ్ అనుకుంటాడు.
మరోసారి జరగదు
సారీ దీప. మరోసారి ఇలా జరగదు జ్యోత్స్న చెబుతుంది. తర్వాత గాజు ముక్కలను దీప క్లీన్ చేస్తుంటే దశరథ్ భోజనాలు అయ్యాక తీసుకోవచ్చని చెబుతాడు. ఆ కొన్నింటికి మనసు ఉండదు. అవి ఎవరినైనా గాయం చేస్తాయి. ఈ గాజు ముక్కులు కూడా అంతే. వీటిని మీరే కొన్నారు. మీరే తీసుకొచ్చారు. మీతోనే ఉన్నాయి కదా అని మీరనుకుంటారు. కానీ, ఇవి కాలు తగలగానే క్షణంలో గాయం చేస్తాయి. ఇలాంటివాటిని దూరంగా ఉంచాలి అని జ్యోను గాజు ముక్కలతో పోలుస్తుంది దీప.
దీపకు నిజం తెలిసినట్లే మాట్లాడుతుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. తర్వాత కార్తీక్, దీప వెళ్లిపోతారు. సారీ తాత. అసలు ఏం జరిగిందంటే అని జ్యో చెప్పబోతుంటే నీ వివరణ నాకు అవసరం లేదు. అగ్రిమెంట్ పేరుతో పని చేసుకోవాలి. హింసించకూడదు అని శివ నారాయణ కోపంగా అంటాడు. ఇంతలో పారు వెళ్లొస్తాను అని కార్తీక్ వచ్చి ట్విస్ట్ ఇస్తాడు.
జ్యో మాటలు వినడానికే కార్తీక్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అక్క ఎలా ఉందో. భోజనం అయ్యాక మాట్లాడాలి. దీప వల్ల జ్యోత్స్నకు తిట్లు పడుతున్నాయి. చెబితే పంపిస్తుంది కదా. చెబితే నమ్మనంతగా దీప ఎలా చెప్పిందో అని సుమిత్ర అనుకుంటుంది. కాశీని కాలర్ పట్టుకుని తీసుకున్న డబ్బులు ఇవ్వమని వార్నింగ్ ఇస్తాడు మాణిక్యం. అది స్వప్న చూస్తుంది.
చంపుతానని బెదిరింపు
వచ్చి కాశీని అడుగుతుంది స్వప్న. కాశీ ఫ్రెండ్ అని కవర్ చేస్తే అందుకేనా చంపుతానని బెదిరిస్తున్నాడని స్వప్న అంటుంది. సారీ. నీకు తెలియకుండా తప్పు చేశాను. సాయం చేశాను, మోసపోయాను. నా ఫ్రెండ్ శీను గాడికి నేను హామీగా ఉండి వడ్డీకి రూ. 10 లక్షల అప్పు ఇప్పిచ్చాను. వాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంక్వైరీ చేస్తే దుబాయ్ వెళ్లిపోయాడు. ఆ మాణిక్యం గాడు రౌడీ. ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు అని కాశీ అంటాడు.
కాశీపై స్వప్న అరుస్తుంది. అకౌంట్లో ఐదు లక్షలు ఉన్నాయిగా. అవి తీసుకొచ్చి ఇవ్వు అని స్వప్న అంటే.. అవి కూడా లేవని కాశీ చెబుతాడు. శౌర్యకు హెల్త్ సమస్య వచ్చినప్పుడు కార్తీక్ బావకు ఇచ్చానని కాశీ చెబుతాడు. అడగ్గానే ఇప్పుడు మనకు పది లక్షలు ఇచ్చేవాళ్లు ఎవరు అని స్వప్న అంటుంది. మరోవైపు జ్యోత్స్న చేసినదాని గురించి కాంచన తిడుతుంది.
మరోవైపు దశరథ్‌తో జ్యోత్స్న తప్పు చేసి ఉండదండి. దీప చెప్పింది కన్ఫర్మ్ చేసుకోవాల్సింది అని కూతురుకు సపోర్ట్ చేస్తుంది సుమిత్ర. ఇంతలో శివ నారాయణ వచ్చి దశరథ్‌తో మాట్లాడాలని తీసుకెళ్తాడు. నాకో మాట చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు ఎలా ఉంది అని కూతురు గురించి శివ నారాయణ అడుగుతాడు. ఉదయం వెళ్లి చూస్తా అని దశరథ్ అంటే ఇప్పుడు కాల్ చేయొచ్చు కదా అని శివ నారాయణ అంటాడు.
చెల్లిని చూడాలనిపిస్తుంది
ఆ మాటలు పారిజాతం వింటుంది. వీడియో కాల్ చేస్తే ప్రపంచమే కనిపిస్తుంది అని శివ నారాయణ అంటే.. నాన్నకు చెల్లిని చూడాలనిపిస్తున్నట్లుంది అని ఫోన్ తీసుకురావడానికి వెళ్తాడు దశరథ్. నాన్నకు కాంచనను చూడాలని ఉందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు అని సుమిత్రకు చెప్పి మొబైల్ తీసుకెళ్లి కార్తీక్‌కు వీడియో కాల్ చేస్తాడు దశరత్. కాంచన మాట్లాడుతుంది.
పక్కన చాటుగా ఉండి కూతురుని చూస్తాడు శివ నారాయణ. తర్వాత శివ నారాయణను దశరథ్ చూపిస్తాడు. దాంతో కాంచన ఎమోషనల్‌గా మురిసిపోతాడు. ఏంట్రా నా వైపు ఫోన్ తిప్పావ్. నువ్ చేసుకున్నావ్గా అని వెళ్లిపోతాడు శివ నారాయణ. ఎవరి కోసం చేశావ్ మావయ్య అని కార్తీక్ అడిగితే నాన్న కోసమే అని దశరథ్ చెబుతాడు. ఎంతైనా కూతురు కదా. త్వరలోనే ఇంటికి కూడా వస్తాడని కార్తీక్ అంటే అది తొందర్లోనే జరుగుతుందని దశరథ్ అంటాడు.
కార్తీక్ వాళ్లు భోజనం చేస్తుంటారు. కాంచనకు కార్తీక్ అన్నం తినిపిస్తాడు. వయసు అయిపోయిన తల్లికి కొడుకు తల్లితండ్రి. నువ్ నా కూతురువి అని కార్తీక్ అంటే శౌర్య వచ్చి మరి నేను అని అంటుంది. నువ్ నా చిన్నకూతురివి అని కార్తీక్ అంటాడు. అంటే నానమ్మ నాకు అక్క అని శౌర్య అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఇద్దరితోపాటు దీపకు కూడా కార్తీక్ అన్నం తనిపిస్తాడు.
చెక్ రాసిస్తా
మరోవైపు తల్లి కావేరికి స్వప్న విషయం చెబుతుంది. నా అకౌంట్లో అమౌంట్ ఉంది చెక్ రాసిస్తా అని లాకర్ కీస్ కోసం వెతుకుతుంది కావేరి. మామ అల్లుడు మోసం గురించి మాట్లాడుకుంటారు. కావేరి వచ్చి లోపలికి రమ్మంటే ఇక్కడే చెప్పమని శ్రీధర్ అంటాడు. లాకర్ కీస్ గురించి అడిగితే నా దగ్గరే సేఫ్‌గా ఉన్నాయి. అవసరం చెబితేనే ఇస్తానని శ్రీధర్ అంటాడు.
చెక్ బుక్ కావాలి. పది లక్షలు డ్రా చేయాలని కావేరి చెబుతుంది. దాంతో శ్రీధర్ నోరెళ్లబెడతాడు. అంత డబ్బు దేనికని శ్రీధర్ అంటే.. కావేరి తప్పలేక జరిగింది చెబుతుంది. ఇప్పుడు అల్లుడు గారిని కాపాడాల్సింది మనమేగా అని కావేరి అంటాడు. అత్త సొమ్ము అల్లుడుకి దారపోయడం అంటే ఇది అని కాశీని మాటలు అంటాడు శ్రీధర్. దాంతో స్వప్న కోప్పడి ఈ మనిషి డబ్బులు ఇవ్వడు అని అంటుంది.
ఆలోచనలో కావేరి
మా ఇబ్బందులు ఏవో మేమే పడతాం అని స్వప్న వెళ్లిపోతుంది. ఇప్పుడు అల్లుడి గారికి ఎలా సాయం చేయాలో ఏమో అని కావేరి ఆలోచిస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్