Salaar OTT: ఓటీటీలో సలార్ సినిమా రన్‍టైమ్ ఇదే.. ఆ రూమర్లకు చెక్!

Best Web Hosting Provider In India 2024

Salaar OTT: బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. రేపు (జనవరి 20) సలార్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంచనా వేసిన దానికంటే ముందే ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ తీసుకొస్తోంది. ప్రేక్షకులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. జనవరి 20నే అర్ధరాత్రి 12 గంటలకు సలార్ స్ట్రీమింగ్‍కు వస్తుందని అధికారికంగా వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు

సలార్ సినిమా ఓటీటీ వెర్షన్‍లో.. థియేటర్‌ ప్రదర్శించని కొన్ని సీన్లు ఉంటాయని ఇటీవల రూమర్లు వచ్చాయి. దీంతో కొన్ని అదనపు సీన్లతో నెట్‍ఫ్లిక్స్‌లో సలార్ స్ట్రీమింగ్ అవుతుందని టాక్ బయటికి వచ్చింది. అయితే, రేపు (జనవరి 20) సలార్ స్ట్రీమింగ్‍కు వస్తున్న తరుణంలో ఓటీటీ రన్ టైమ్ వెల్లడైంది.

సలార్ సినిమా రన్ టైమ్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఉండనుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ పేర్కొంది. థియేటర్లలోనూ ఈ మూవీ రన్ టైమ్ ఇలాగే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఓటీటీలో సలార్‌కు అదనపు సీన్లు ఉండవు. థియేటర్ వెర్షన్‍నే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. దీంతో, ఓటీటీలోకి ఎక్స్‌ట్రా సీన్లతో సలార్ వస్తుందన్న రూమర్లకు చెక్ పడింది.

సలార్ సినిమా జనవరి 20వ తేదీ అర్ధరాత్రి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఈ మూవీలో హిందీ వెర్షన్ మాత్రం ఇప్పుడు రావడం లేదు. హిందీ డబ్బింగ్ వచ్చేందుకు మరింత ఆలస్యం కానుంది. హిందీలో 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సలార్ హిందీ వెర్షన్ మార్చిలో వస్తుందని టాక్ ఉంది. హిందీ వెర్షన్‍పై నెట్‍ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

 

భారీ అంచనాల మధ్య సలార్ సినిమా గత డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంతో ప్రభాస్ మళ్లీ హిట్ బాటపట్టారు. సలార్‌లో ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు విపరీతంగా మెప్పించాయి.

సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా చేశారు. జగపతిబాబు, ఈశ్వరిరావు, టినూ ఆనంద్, బాబి సింహా, శ్రీయారెడ్డి, దేవరాజ్, రామచంద్ర రాజు కీరోల్స్ చేశారు.

సలార్ చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన సలార్ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్ స్ట్రీమింగ్‍కు తీసుకొస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, సర్‌ప్రైజ్‍గా అనుకున్న దాని కంటే ముందుగానే రేపు (జనవరి 20) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని ఆ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (జనవరి 19) ప్రకటించింది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024