Best Web Hosting Provider In India 2024
05 May 2024 8:37 PM

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు
తాడేపల్లి: ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా అమలులోకి రాకముందే చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు పచ్చమీడియాతో కలసి కుట్రపూరితంగా విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
- – ఏపిలో 17 వేల గ్రామాలకు గాను కేవలం ఆరువేల గ్రామాలలోనే భూ రీసర్వే పూర్తి అయింది.
- – అన్ని గ్రామాలలో పూర్తి అయితేనేగాని చట్టం అమలులోకివచ్చే పరిస్దితి ఉండదు.
- – రైతులు,భూయజమానులు అభ్యంతరాలు తెలియచేసే అవకాశం ఉంది.
- – అది జరిగేందుకు ఇంకా రెండు,మూడేళ్ల సమయం పడుతుంది.
- – రామోజి,రాధాకృష్ణ,పవన్ కల్యాణ్ లకు రైతులకు గురించి భూములు గురించి మాట్లాడే నైతికహక్కు లేదు.
- – చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.
- – దుష్ప్రచారాలతో,తప్పుడు రాతలతో ప్రజలలో యాక్ట్ గురించి అయోమయం కలగచేస్తున్నారు.
- – జగన్ గారిని ఉద్దేశ్యించి భూములను దోచుకుంటున్నారని కుట్రపూరితంగా విషం చిమ్ముతున్నారు.
- – రాష్ర్టంలో పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.
- – ప్రజలు గమనించాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన అడంగల్,ib,భూములు అక్రమాలకి గురి కావు.వాటికి సంబందించి ఇబ్బందులు కలగకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో అవకాశం ఉంది
- – బీజేపీ కేంద్ర నాయకులు రాష్ర్టంలో పర్యటన చేస్తున్నారు కూటమి లో భాగస్వామి అయిన బిజేపి నేతలతో ఈ యాక్ట్ సరైంది కాదని చెప్పించే దమ్ము చంద్రబాబు,పవన్ కి ఉందా..
- – బిజేపి రాష్ర్ట అద్యక్షురాలు పురేందేశ్వరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సరైనదని అన్నారు.
- – ఎన్నికల సమయంలో జగన్ గారి వ్యక్తిత్వ హననం జరుగుతోోంది.ఇందుకు సంబంధించి భారీ కుట్ర జరగుతోంది.
- – అమిత్ షా పోలవరం గురించి మాట్లాడారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలి.
- – పోలవరం ను ఏటిఎం లా చంద్రబాబు వాడుకున్నాడని నరేంద్ర మోది బహిరంగంగా ప్రకటించారు.
- – కేంద్రం నిర్మించాల్సిన పోలవరం రాష్ర్టం ఎందుకు నిర్మిస్తోంది.చంద్రబాబు దోచుకోవడానికి అలా చేసిన విషయం ప్రజలందరికి తెలుసు.
- – బ్రిటీష్ కాలం నాటి రికార్డులను ఆధునికరించి భూవివాదాలు లేకుండా చేయాలని చట్టంలో నిర్దేశించారు.